BSF Constable Suicide : గుజరాత్ లోని గాంధీనగర్ లో తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ బల్ల గంగా భవానీ బలవన్మరణానికి పాల్పడింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గంగా భవానీ గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన యువతి, తన క్వార్టర్స్‌లో ఆత్మహత్య చేసుకుంది. 15 రోజుల క్రితమే యువతి నిశ్చితార్థం కాగా, ఇంతనే బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో విషాదం నింపింది. గంగా భవానీ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సెంట్రింగ్ డ్యూటీ చేసింది. అనంతరం తన క్వార్టర్స్‌కు వెళ్లింది. రాత్రి 9 గంటలు అయినా యువతి డ్యూటీకి రాకపోవడంతో అధికారులు ఆమె క్వార్టర్స్ కు వెళ్లారు. తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులను తొలగించి లోపలి వెళ్లగా… ఆమె కిటికీకి ఉరేసుకుని ఉండటం గమనించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.