కరీంనగర్ లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్ధులను గణనాథుడు కలిపారు. నగరంలోని టవర్ సర్కిల్, ప్రకాశ్ గంజ్, శాస్త్రీ రోడ్ లో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అప్యాయంగా పలుకరించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.