Home అంతర్జాతీయం Indian Overseas Bank: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు; ఇలా అప్లై చేయండి..

Indian Overseas Bank: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు; ఇలా అప్లై చేయండి..

0

అర్హతలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు వర్తించే చోట స్థానిక భాషను పరీక్షిస్తారు. అలాగే, బ్యాంక్ నిర్ణయించిన విధంగా వ్యక్తిగత ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ పరీక్షలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. తమ రాష్ట్రాల్లో ట్రైనింగ్ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రంలోని ఏదైనా ఒక స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం, అవగాహన) కలిగి ఉండాలి.

Exit mobile version