Home తెలంగాణ పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గడపదొక్కిన కెఎ పాల్  | KA Paul

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గడపదొక్కిన కెఎ పాల్  | KA Paul

0

posted on Aug 30, 2024 2:23PM

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రజా శాంతి పార్టీ  అధ్యక్షుడు కెఏ పాల్ న్యాయ పోరాటానికి దిగారు. తెలుగునాట రాజకీయాల్లో ఫిరాయింపులు కొత్తేం కాదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో వలసలను ఆ  పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ప్రోత్సహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి బిఆర్ఎస్ లో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అదే ఫార్ములాను కాంగ్రెస్ కొనసాగించింది.  గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పరాజయం చెందిన తర్వాత కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఈ వలసలు లేదా ఫిరాయింపులు నేటి వరకు ఆగడం లేదు. కెఏ పాల్ కు ఇది రుచించలేదు. కోర్టు తలుపు తట్టి న్యాయం కావాలని అర్థిస్తున్నారు. 

ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం అన్యాయమని కెఏ పాల్ భావన. హైకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా దానం నాగేందర్ ప్రస్తావన తెచ్చారు. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం తగదన్నారు. ఆరు నెలలు తిరగకముందే కాంగ్రెస్ లో జంప్ కావడం అనైతికమని పాల్ వాదిస్తున్నారు. అధికారమే పరమావధిగా పార్టీలు మారుతున్నవారికి సంకెళ్లు వేయడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని పాల్ అభ్యర్థించారు.  తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 

Exit mobile version