posted on Aug 30, 2024 6:18PM
ఈ కేసుకు సంబంధించి విచారణాధికారుల ఇప్పటికే అప్పటి గుంటూరు సీఐడీ ఏఎస్పీకీ విజయ్ పాల్ కు నోటీసు జారీ చేశారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
అప్పటికి నరసాపురం ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు అప్పటి వైసీపీ ప్రభుత్వ తీరుపై, జగన్ విధానాలపై విమర్శలు గుప్పించడంతో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి సీఐడీ పోలీసులు రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయనున్నారు. కాగా ఈ కేసులో జగన్ కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ నోటీసులను అందుకుని జగన్ పోలీసు స్టేషన్ కు వస్తారా లేక కోర్టును ఆశ్రయించి తనపై అభియోగాలను క్వాష్ చేయాలని కోరుతారా అన్నది చూడాల్సి ఉంది.