ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లోకంటే కర్నాటకలో, లండన్లో ఎక్కువగా వుంటున్నారు. మొన్నీమధ్యే కదా విదేశాలకు వెళ్ళొచ్చారు. మళ్ళీ ఇంకోసారి ఫారిన్ టూర్‌కి బయల్దేరబోతున్నారు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్‌లో పర్యటనలో పర్యటించబోతున్నారు. ఆయన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి ఆయన లండన్‌కి వెళ్తున్నారట. దీనికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వస్తారా.. రారా అనే అనుమానాలు తలెత్తాయి. ఎందుకు వెళ్ళారనే డౌట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అవే అనుమానాలు, డౌట్లు వస్తున్నాయి. కొంతమంది అయితే, జగన్‌కి లండన్‌లో మానసిక వ్యాధికి ట్రీట్‌మెంట్ జరుగుతోందని, అందుకే ఆయన పదేపదే లండన్ వెళ్తున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో ఆ లండన్ మహా నగరానికే తెలియాలి.