Home తెలంగాణ రుణమాఫీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, తప్పుల సవరణలకు మార్గదర్శకాలు జారీ-adilabad govt released guidelines...

రుణమాఫీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, తప్పుల సవరణలకు మార్గదర్శకాలు జారీ-adilabad govt released guidelines to runa mafhi farmers accounts corrections ,తెలంగాణ న్యూస్

0

రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలుగా తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యా దుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ ను రూపొందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి అనుగుణంగా యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళతారు. ముందుగా వారి రుణఖాతాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే గాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు తీసుకుంటారు. ఈ సర్వేలో కార్యదర్శి, అధికారులు నిజనిజాలను ధ్రువీకరించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ.2 లక్షల కంటే ఎక్కువ గల రుణాలను పైన సొమ్ము కడతామని రైతు చెబితే వారి వివరాలు సైతం నమోదు చేసుకుని బ్యాంకులకు సమాచారం అందేలా యాప్ ను రూపొందించారు.

Exit mobile version