Home తెలంగాణ ముంబై హీరోయిన్‌కి వైసీపీ నేత చిత్రహింసలు! | ycp leader harassment to mumbai heroine|...

ముంబై హీరోయిన్‌కి వైసీపీ నేత చిత్రహింసలు! | ycp leader harassment to mumbai heroine| mumbai heroine

0

posted on Aug 26, 2024 7:43PM

అధికారంలో వున్నా, అధికారం పోయినా వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, లీలలు మాత్రం నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. ఇంతకాలం వైసీపీ నాయకులు తమ తెలివితేటలను లోకల్‌గానే చూపిస్తున్నారని అనుకుంటున్నాం. వీళ్ళ తెలివితేటలు సరిహద్దులు దాటి.. రాష్ట్రాలు దాటి ముంబై వరకు చేరుకున్నాయి. ముంబైకి చెందిన ఆషా జెత్వానీ అనే హీరోయిన్‌ని, ఆమె తల్లిదండ్రులని, బంధువులని ఒక హీరోయిన్‌ని వైసీపీలో బాగా పలుకుబడి వున్న నాయకులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, తప్పుడు కేసులో ఇరికించి జైలుపాలు చేసిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అనగనగా ఆషా జెత్వానీ అనే ఒక ముంబై హీరోయిన్. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. పెద్దగా సక్సెల్ ఏమీ రాలేదు. ఆ తర్వాత ముంబైకి వెళ్ళిపోయింది. సినిమా హీరోయిన్ వేషాల మీద ఆశలు వదులుకుని, టీవీ సీరియళ్ళలో పాత్రలు ధరిస్తోంది. ఆమె టాలీవుడ్‌ సినిమాల్లో నటించినప్పుడు ఏపీకి చెందిన ఒక పెద్ద పోస్టు వెలగబెట్టిన వైసీపీ నాయకుడితో పరిచయం కలిగింది. ఆ పరిచయం చాలా దూరమే వెళ్ళిందన్న అభిప్రాయాలున్నాయి. పెద్ద గోకుడు మాస్టర్‌గా పేరున్న ఆ వైపీ బడా లీడర్, ఆ  హీరోయిన్ మధ్య ఏం జరిగిందో ఊహించలేని అమాయకులు ఎవరూ లేరు. కొంతకాలం హైదరాబాద్‌లో వేషాల కోసం ప్రయత్నించిన ఆమె ముంబైకి వెళ్ళిపోయింది. తనకు, తెలుగు రాష్ట్రాలకు ఇక సంబంధం లేదు అని ఆమె భావిస్తున్న తరుణంలో, ఏపీకి చెందిన ఆ వైసీపీ నాయకుడు ఆమె జీవితంలోకి మళ్ళీ ప్రవేశించాడు. 2024లో రాష్ట్రంలో జగన్ పార్టీ అధికారంలో వున్న సమయంలో తన అధికార బలంతో, అధికార మదంతో సదరు హీరోయిన్ జీవితంలో ఆడుకున్నాడు. పోలీసుల సహకారంతో ఆ హీరోయిన్‌ని చిత్రహింసలకు గురిచేశారు.

జగన్ హయాంలో ఆయన చెప్పినట్టల్లా ఆడి, జగన్ అరాచక పాలనకు తనవంతు సహాకారం అందించిన ఒక ఐపీఎస్ అధికారి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏ పోస్టులోనూ నియమించకపోవడంతో ఖాళీగా వున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అ గొప్ప ఐపీఎస్ ఆఫీసర్, సీఐగా వెలగబెట్టిన ఒక అధికారి సహకారంతో సదరు వైసీపీ పెద్దమనిషి ముంబై హీరోయిన్‌ని చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. సదరు వైసీపీ నేత ఆ హీరోయిన్ మీద తప్పుడు కేసు పెట్టాడు. ఐపీఎస్ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా కమిషరేట్ కార్యాలయం నుంచి టాస్క్ ఫోర్స్ టీమ్ ముంబైకి వెళ్ళింది. ఆషా జెత్వానీని, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి 2024 ఫిబ్రవరిలో విజయవాడకి తీసుకొచ్చింది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఒక ప్రదేశంలో హీరోయిన్‌ని, ఆమె కుటుంబాన్ని రెండు వారాలపాటు నిర్బంధించింది. అక్కడ ఆమెని పోలీసులు శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. అక్రమ కేసులో అరెస్టు చేసి సబ్ జైలుకు పంపారు. ఈ వార్త మీడియాకి తెలియకుండా అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ దారుణం బయటకి వచ్చింది. 

ఇబ్రహీంపట్నంలో ఉండని వ్యక్తి, ఎక్కడో కృష్ణా జిల్లా ప్రాంతంలో మొవ్వ మండలంలో ఉండే వ్యక్తి ఫిర్యాదుతో ఈ హీరోయిన్‌ని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ముంబైకి వెళ్ళి మరీ ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు ఆ హీరోయిన్‌తో సన్నిహితంగా వున్న ఆ వైసీపీ నాయకుడు ఆమెను చిత్ర హింసలకు ఎందుకు గురిచేయించాడు? ఎందుకు జైలుకు పంపించాడు.. ఇప్పుడు ఇవన్నీ రహస్యాలుగా వున్నాయి. ఈ రహస్యాలను ఛేదించే ప్రాసెస్ కూడా జరుగుతోంది. త్వరలో దీనికి సబంధించిన అన్ని వివరాలూ అధికారంగా బయటకు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

Exit mobile version