అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో సుమారు రెండు నెలలుగా జైలులో ఉంటున్నాడు కన్నడ స్టార్ హీరో. పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఈ హీరోను చూసి చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బయట లగ్జరీ లైఫ్ గడిపిన తమ హీరో జైలులో మగ్గిపోతున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా అబద్ధమని అర్థమై పోయింద. జైలులో హీరో దర్శన్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ అందుతుందని తెలుస్తోంది. సెంట్రల్ జైలులో అతను రాజ భోగాలు అందుకున్నట్లు స్పష్టమవుతోంది. జైలు ఆవరణలో దర్శన్ ఇతర రౌడీ షీటర్లతో కూర్చుని కులాసాగా కాఫీ తాగుతూ, సిగరెట్ ఊదుతూ కబుర్లు చెప్పుకుంటున్న ఫోటో వైరల్‌గా మారింది. దీంతో పాటు వీడియో కాల్‌లో కూడా మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో జైలు అధికారులు, ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య సదరు జైలు సిబ్బంది, ఉన్నతాధికారులప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబధించి డీజీ అండ్ ఐజీపీ అలోక్ మోహన్ నుంచి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. అలాగే దర్శన్ తదితరులను వెంటనే వేరే జైళ్లకు తరలించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు.