ఏపీలో నైపుణ్య గణన సర్వే
ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణన సర్వేకు సిద్ధమైంది. ఈ మేరకు ఐటీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ సెన్సస్ పై ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్… ఈ సర్వేలో యువత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, నైపుణ్యాలు తెలుసుకుని ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తామన్నారు. ఈ ప్రొఫెల్స్ ఆయా కంపెనీలు నేరుగా యాక్సెస్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్హతలు, నైపుణ్య వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామన్నారు.