Home అంతర్జాతీయం EPFO alerts : ఈపీఎఫ్​ఓ సభ్యులకు గుడ్​ న్యూస్​- ఇక ఆ కష్టాలన్నీ దూరం!

EPFO alerts : ఈపీఎఫ్​ఓ సభ్యులకు గుడ్​ న్యూస్​- ఇక ఆ కష్టాలన్నీ దూరం!

0

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ)తో సంబంధం ఉన్న సభ్యులకు గుడ్​ న్యూస్​! పోర్టల్​లో సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఐటీ సిస్టెమ్ 2.01ను తీసుకురావాలని ఈపీఎఫ్​ఓ నిర్ణయించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు పోర్టల్, యాప్​నకు సంబంధించిన సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. కొత్త విధానం వచ్చాక పోర్టల్​లోకి లాగిన్ అయ్యి క్లెయిమ్ చేసుకోవడం, సెటిల్ చేయడం వంటివి మునుపటి కంటే సులువు అవుతాయి. దీంతో కొత్త విధానం వచ్చిన తర్వాత, ఉద్యోగాలు మారినప్పుడు మెంబర్ ఐడీ (ఎంఐడీ) బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు.

Exit mobile version