Home తెలంగాణ  విచారణకు జోగి రమేష్ మరోమారు డుమ్మా?

 విచారణకు జోగి రమేష్ మరోమారు డుమ్మా?

0

posted on Aug 21, 2024 1:54PM

వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ మంగళవారం  విచారణకు డుమ్మా కొట్టడంతో పోలీసులు మరోమారు నోటీసులు ఇచ్చారు. బుధవారం  సాయంత్రం 4 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో కుమారుడి అరెస్ట్‌ను సాకుగా చూపి గతంలోనూ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు.

శుక్రవారం మంగళగిరి పోలీసుల ఎదుట జోగి రమేశ్ హాజరయ్యారు. గంటపాటు విచారించిన అనంతరం ఆయనను పంపించి వేశారు. మంగళవారం  మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. జోగి రమేశ్ విచారణకు రాలేకపోతున్నట్టు ఆయన తరపు లాయర్లు పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాజగా మరోమారు పోలీసులు నోటీసులు జారీచేశారు. జోగిరమేష్ ఒక స్టాండ్ తీసుకున్నారు. మంగళవారం రాని జోగిరమేష్ బుధవారం రాకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులకు సహకరించకుండా నిస్పక్ష విచారణ జరగడం సాధ్యం కాదు. జోగిరమేష్ వాడిన సిమ్ కార్డులను సమర్పించాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిమ్ కార్డులు లేవని తన  తరపున విచారణలో హాజరైన లాయర్లు తెలిపారు. నేను వస్తున్నాను అని చెప్పిన జోగిరమేష్ మంగళవారం డుమ్మా కొట్టారు. విచారణకు ఎప్పుడైనా వస్తాను చెప్పిన జోగిరమేష్ మరో మారు డుమ్మా కొట్టారు. జోగిరమేష్ వాడిన ఫోన్లు ఇంతవరకు సమర్పించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 

Exit mobile version