ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఓ మంత్రి ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన వెనక ఓ చిరుత రావడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అది చిరుత కాదని పోలీసులు అంటున్నారు. అది సాధారణ పిల్లి అని వెల్లడించారు. అయితే పోలీసుల సమాధానంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.