Home తెలంగాణ బాక్సాఫీసులో బాంబు.. రాజకీయాల్లో రాంబో… మన బాలయ్య! | balakrishna hatrics in cinema| politics|...

బాక్సాఫీసులో బాంబు.. రాజకీయాల్లో రాంబో… మన బాలయ్య! | balakrishna hatrics in cinema| politics| boxoffice| bomb

0

posted on Jun 10, 2024 2:10PM

తాను పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. సినిమా అయినా, రాజకీయమైనా తన విజయపరంపరను కొనసాగిస్తూ.. తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఆయన పేరు మారుమోగిపోతోంది.

60 ఏళ్ళ వయసులోనూ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని.. యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు బాలకృష్ణ.  అలాగే రాజకీయాలలో కూడా వరుసగా మూడు సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు.   2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నందమూరి నట సింహం.. 2019 లో  తెలుగుదేశంకు ఎదురుగాలి వీచినా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు.  ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందూపురంలో గెలుపు జెండా ఎగురవేశారు. పైగా ప్రతి ఎన్నికకు తన మెజారిటీని పెంచుకుంటూ రావడం విశేషం. 2014లో 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన బాలయ్య..  2019లో 18 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ఏకంగా 32 వేల మెజారిటీతో బాలకృష్ణ విజయబావుటా ఎగరవేశారు.  మొత్తానికి అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ బాలయ్య హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోవడం పట్ల నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

(బాలకృష్ణ జన్మదినం సందర్భంగా..)

Exit mobile version