ఉన్న కేసులు సరిపోవా అన్నట్టు జగన్ మీద మరో పెద్ద కేసు పడబోతోంది. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మొత్తం ఇరుక్కుపోయిన కేసే లాంటి కేసే ఇది.. అదే ఫోన్ ట్యాపింగ్ కేసు. పెగాసిస్ సాఫ్ట్.వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖుల ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్రాక్ చేసిందని, ఈ ట్యాపింగ్ మీద తన దగ్గర కచ్చితమైన ఆధారాలు వున్నాయని నారా లోకేష్ చెబుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే జగన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ మీద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే అవకాశం వుందని తెలుస్తోంది.