గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచి, మొదటి విజయంతోనే కేంద్ర మంత్రివర్గంలో సహాయమంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ఆయన భార్య డాక్టర్ పెమ్మసాని శ్రీరత్న కూడా చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రమంత్రి అయ్యారు. ఈ కృతజ్ఞతను పెమ్మసాని శ్రీరత్న వ్యక్తం చేశారు. తన భర్త కారుకు తెలుగుదేశం జెండాను అమర్చి సెల్యూట్ చేశారు.