Home తెలంగాణ జగన్ కు అమ్మ విజయమ్మ ఓదార్పు | VIJAYAMMA solace JAGAN| MOTHER| AMERICA| TOUR|...

జగన్ కు అమ్మ విజయమ్మ ఓదార్పు | VIJAYAMMA solace JAGAN| MOTHER| AMERICA| TOUR| RETURN| REACH| JAGAN

0

posted on Jun 10, 2024 9:32AM

ఎన్నికలలో గతంలో ఎవరికీ దక్కనంత ఘోరమైన ఓటమి ఈ సారి జగన్ నాయకత్వంలోని వైసీపీకి దక్కింది. కనీసం ప్రతిపక్షహోదాకి కూడా నోచుకోని గొప్ప పరాజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడిన అనేక అంశాలలో ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కూడా ఒకటి.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేని గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర సుదీర్ఘంగా సాగింది. మందీ మార్బలంతో ఆయన ఆ యాత్రను విడతల వారీగా ఏళ్ల తరబడి కొనసాగించారు. సరే అది పక్కన పెడితే.. 2014 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ కు సొంత పార్టీ నుంచే అండ కరవైంది. నిన్న మొన్నటి దాకా వంధిమాగధులుగా మెలిగిన కీలక మంత్రులు, నేతలు సైతం ఇప్పుడు ఓటమికి పూర్తి బాధ్యత జగన్ దే అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతూ, పార్టీ ఘోర పరాజయానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అంటూ నిందిస్తున్నారు. 

ఈ తరుణంలో తల్లి విజయమ్మ జగన్ కోసం ఆయన ఇంటికి వచ్చి ఒకింత ఓదార్పు ఇచ్చారు. పోలింగ్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు తల్లి విజయమ్మ తన కుమార్తెకు మద్దతు పలుకుతూ అమెరికా నుంచి ఓ వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే. దీంతో కన్న తల్లి కూడా జగన్ కు మద్దతుగా నిలవడం లేదని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. తల్లి మనసు ఆగలేదు. ఆమె అమెరికా పర్యటన ముగించుకుని నేరుగా జగన్ నివాసానికి చేరుకున్నారు.  కుమార్తెను గెలిపించమని వీడియో సందేశం ద్వారా పోలింగ్ ముందు రోజు కడప ప్రజలకు పిలుపునిచ్చిన విజయమ్మ.. ఆ సందర్భంగా కుమారుడి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ఎన్నికల ముందు లండన్ వెళ్లిన విజయమ్మ, అక్కడ షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గర ఉన్నారు.   అయితే కుమారుడు ఘోరంగా పరాజయం పాలై ముఖ్యమంత్రి పదవి కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉండటంతో తల్లిమనసు తల్లడిల్లి అమెరికా నుంచి నేరుగా కుమారుడి వద్దకు వెళ్లి ఓదార్పునిచ్చారు. 

Exit mobile version