Home తెలంగాణ మూడోసారి ప్రధానిగా మోదీ మార్కు కేబినెట్

మూడోసారి ప్రధానిగా మోదీ మార్కు కేబినెట్

0

posted on Jun 9, 2024 7:57PM

భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  మాజీ ప్రధాని నెహ్రూ వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఎవరికి ఏయే పదువులు ఇస్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఈ విషయంపై ఇప్పటికే ఎన్​డీఏ మిత్రపక్ష నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపి లిస్ట్ ఫైనలైజ్ చేశారు.

. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. మోదీతోపాటు పలువురు ఎంపీలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని విజయతీరాలకు చేర్చిన నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. దీంతో భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ఆదివారం సాయంత్రం అంగరంగా వైభవంగా జరిగిన పట్టాభిషేక వేడుకలో మోదీతోపాటు పలువురు నేతలు కూడా ప్రమాణస్వీకారం చేశారు.

2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ హాజరయ్యారు. ఈసారి ఐదుగురు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8వేల మంది దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్‌ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ విచ్చేశారు.మోదీ ప్రమాణస్వీకారోత్సవ వేడుక వేళ దిల్లీవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. దిల్లీని రెండు రోజుల పాటు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్​ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

Exit mobile version