Home తెలంగాణ కౌశిక్ రెడ్డి ఖబడ్దార్

కౌశిక్ రెడ్డి ఖబడ్దార్

0
  • నిరాధారమైన ఆరోపణలతో పొన్నం ని విమర్శిస్తే ఉరికించి కొడతం
  • వెంటనే మంత్రి పొన్నంకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
  • అసత్య ఆరోపణలు మానుకో
  • లీగల్ సెల్ వెంటనే చర్యలు చేపట్టాలి
  • డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత

జనవహిణి బ్యూరో భానుబాబు :- మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కౌశిక్ రెడ్డి ఖబడ్దార్ అంటూ డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత హెచ్చరించారు. ఆయన ఆదివారం రేకొండ గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ సింగరేణికి సంబంధించి బొగ్గు నుండి వచ్చిన బూడిద పరిమితికి మించి లారీలలో ఓవర్ లోడ్ తో పోతుందని దానికి కారణం మంత్రి పొన్నమే అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కనీసం వ్యవస్థ మీద అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.అసలు సింగరేణి బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యే బూడిదకు టెండర్ కేంద్ర ప్రభుత్వం వేస్తుందని జాతీయ రహదారులకు బూడిదను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆ విషయం కూడా తెలియకుండానే మంత్రిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. కేంద్రానికి సంబంధించిన సింగరేణి సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు సంబంధం లేని అంశాన్ని తనపై కావాలని కక్షపూరితంగా కౌశిక్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా వ్యవస్థ పైన అవగాహన పెంచుకొని మాట్లాడాలని హితవు పలికారు. లేని యేడల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులపై ఎవరు అసత్య ఆరోపణలు చేసిన లీగల్ సెల్ చర్యలు చేపడితే మరో మారు అసత్య ఆరోపణలు చేయకుండా ఉంటారని ఆయన తెలిపారు.బడుగు బలహీన వర్గాల నాయకుడైన పొన్నం ప్రభాకర్ పై పదేపదే కక్షపూరితమైన వ్యవహార శైలితో కౌశిక్ రెడ్డి మాట్లాడే తీరు, భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా చేస్తుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఉపసర్పంచ్ మోర ప్రవీణ్ కుమార్, బిసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గొడిశాల సుభాష్, బూత్ కన్వీనర్లు దొడ్ల రమణారెడ్డి, పరుపాటి జయపాల్ రెడ్డి, నాయకులు సిద్ది రాజ్ కుమార్, పిట్టల తిరుపతి, దొడ్ల వెంకట్ రెడ్డి, పల్లె శంకర్, మహమ్మద్ షరీఫ్, అప్పాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version