కేంద్రమంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎంపీగా రాణిస్తున్నారు. రామ్మోహన్ నాయుడికి కేబినెట్ హోదా లభించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.