Home అంతర్జాతీయం LSAT Result 2024: ప్రముఖ లా కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘ఎల్ శాట్ 2024’ ఫలితాల...

LSAT Result 2024: ప్రముఖ లా కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘ఎల్ శాట్ 2024’ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

0

ప్రముఖ లా కాలేజీల్లో అడ్మిషన్స్

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్ ఎస్ ఏసీ) 2024 మే 16 నుంచి మే 19 వరకు ఎల్ శాట్ ఇండియా 2024ను నిర్వహించింది. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 2 గంటల 30 నిమిషాల పాటు పరీక్ష జరిగింది. అనలిటికల్ రీజనింగ్ (23 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ -1 (22 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ -2 (23 ప్రశ్నలు), రీడింగ్ కాంప్రహెన్షన్ (24 ప్రశ్నలు) కలిపి మొత్తం 92 ప్రశ్నలు ఉన్నాయి. ఈ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా దేశంలోని ప్రముఖ లా కాలేజీలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లకు లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. ఈ కళాశాలలు, ఎల్ శాట్ ఇండియాతో అనుసంధానమై ఉంటాయి. అభ్యర్థులు ఎల్ శాట్ ఇండియా 2024 గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.

Exit mobile version