రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 10, 11న నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు, మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణతో పాటు మిగిలిన కోస్తాంధ్రలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.