ఆదివారం నాడు (09-06-2024) నాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్లకు కేంద్ర మంత్రిపదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మినిస్టర్ పదవి, పెమ్మసాని చంద్రశేఖర్‌కి సహాయ మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ రాజమహేద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధీశ్వరికి, జనసేనకు చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీడీపీకి చెందిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.