Home తెలంగాణ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు  | Extension of judicial remand of Kavita

కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు  | Extension of judicial remand of Kavita

0

posted on May 20, 2024 5:42PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయి కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. నేటితో ఆమె కస్టడీ ముగియగా.. ఆమెను సీబీఐ అధికారులు తీహార్ జైలు నుంచే వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆమె రిమాండ్‌ను జూన్ 3 వరకు పొగడిస్తూ తీర్పును వెలువరించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. రెండు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. 

Exit mobile version