Home తెలంగాణ జగన్‌కి లండన్‌లో మానసిక చికిత్స? | mental treatment for jagan| jagan london| jagan...

జగన్‌కి లండన్‌లో మానసిక చికిత్స? | mental treatment for jagan| jagan london| jagan treatment| ycp jagan

0

posted on May 20, 2024 5:41PM

‘ఓడిపోవడం ఖాయం అని తెలిసిపోవడంతో జగన్ లండన్‌కి పారిపోయాడు’ ఇప్పుడు దేశంలో ఎవర్ని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు. కానీ, అలా అనడం తప్పు కదా? ఇండియాలో ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు పెట్టుకుని జగన్ లండన్ ఎందుకు పారిపోతాడు? ఒకవేళ పారిపోయాడే అనుకోండి.. విజయ్ మాల్యాలాగా, నీరవ్ మోడీలాగా దొంగ బతుకే కదా.. పులివెందుల పులి అలా దొంగ బతుకు బతుకుతుందా చెప్పండి? ఎన్నికేసులనైనా ఎదుర్కొనే ధైర్యం, జైల్లో ఎంతకాలం వుండటానికైనా సిద్ధపడే నైజం జగన్ సొంతం. పైగా పదహారు నెలల జైలు అనుభవం కూడా ఆయనకి వుంది. అందువల్ల జగన్ పర్మినెంట్‌గా లండన్‌కి పారిపోయే ఛాన్సే లేదు కాబట్టి.. ఆ పారిపోయే టాపిక్‌ ఇక్కడితో క్లోజ్.

అయితే జగన్ లండన్ ఎందుకు వెళ్ళినట్టు? ఆయనకి ఇక్కడ లేనిది లండన్లో ఏముంది? ఒక్కసారి బెంగళూరు ప్యాలెస్‌‌ లోపలకి అడుగు పెడితే లండన్ మహారాణి ప్యాలెస్‌ కంటే నాలుగింతలు ఎక్కువ బిల్డప్పు వుంటుంది. బెంగుళూరు ప్యాలెస్‌లో వున్నామా.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో వున్నామా అనేది కూడా అర్థం కానట్టుగా వుంటుంది. పోనీ విహారయాత్రకు వెళ్ళారా అంటే, లండన్‌ని మించిన విహారయాత్రకు అనువైన ప్రదేశాలు, భూతల స్వర్గాలు ప్రపంచంలో చాలా వున్నాయి. అఫ్‌కోర్స్ స్విట్జర్లాండ్‌లో కూడా జగన్ టూర్ వుందనుకోండి. అయినా టూరిజం విషయంలో లండన్‌ని తక్కువ చేయడం కాదుగానీ, జగన్ లండన్ వెళ్ళింది కేవలం టూరిజం పర్పస్ కోసమే కాదని.. లండన్ టూర్ వెనుక ఇంకేదో వుందనే సందేహాలున్నాయి. 

లండన్‌లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన, ఎంతో నైపుణ్యం వున్న మానసిక నిపుణులు వున్నారు. ఎంతటి మానసిక సమస్యనైనా సరిదిద్దే చాతుర్యం వాళ్ళ దగ్గర వుంటుంది. జగన్ లండన్ వెళ్ళడం వెనుక మానసిక వైద్యం అనే కోణం కూడా వుందని తెలుస్తోంది. జగన్ ‘నార్సీ’ అనే మానసిక వ్యాధి కలిగి వున్నారని కొంతమంది మానసిక వైద్య నిపుణులు ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్‌కి వున్న ‘నార్సీ’ మానసిక వ్యాధి గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అబద్ధాలు చెప్పీ చెప్పీ ఆ అబద్ధాలే జనం నిజం అనుకునేలా చేయడం, తనకంటే ఎవరూ ఉన్నత స్థాయిలో వుండకూడదని కోరుకోవడం, అలా వున్నవారిని కిందకి దించే ప్రయత్నాలు చేయడం, హింసను ప్రేరేపించడం, ఎవరు ఏమైపోయినా పర్లేదు, తన ఇగో మాత్రమే గెలవాలి అనుకోవడం… ఇలాంటి లక్షణాలన్నీ జగన్‌లో వున్నాయి. 2019 ఎన్నికలలో జనం 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించుకోవయ్యా అంటే, అలా చేయకుండా అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుంచే విధ్వంస రచన చేయడమే ‘నార్సీ’ వ్యాధి ఏ స్థాయిలో వుందనేదానికి నిదర్శనం. తనను తాను మహారాజులా భావించుకోకుండా నీతిగా, నిజాయితీగా పరిపాలిస్తే జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు.. కానీ, ఆయన అనుసరించిన ధోరణుల వల్ల ‘ఒక్కసారి చాలు బాబోయ్’ అని జనం చేత అనిపించుకుని, తన కుర్చీని తానే కాలితో తన్నుకున్నారు. చివరికి జనంలో కూడా పలచనైపోయారు. తనకు కలిసి వస్తుందనుకున్న ‘నార్సీ’ మానసిక పరిస్థితి ఇప్పుడు జగన్‌ని పాతాళంలోకి పడేసింది.

ఈ ‘నార్సీ’ మానసిక ధోరణిని వదిలించుకోవడంతోపాటు మరికొన్ని మానసిక సమస్యలకు కూడా చికిత్స పొందే ఉద్దేశంతోనే జగన్ లండన్ వెళ్ళారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. జగన్‌కి తనలో తాను మాట్లాడుకునే అలవాటు వుంది. అది ఎన్నో సందర్భాల్లో బయటపడింది. అలాగే తనకు గిట్టనివాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళని చెంపమీద కొట్టే షార్ట్ టెంపర్ కూడా వుంది. గతంలో ఒక వెలుగు వెలిగి కుప్పకూలిపోయిన సాఫ్ట్.వేర్ దిగ్గజాన్ని జగన్ చెంపమీద కొట్టారని చెబుతారు. అలాగే బాబాయ్ మర్డర్‌కి కొంతకాలం ముందు ట్రైలర్‌గా చెంపదెబ్ద కొట్టారని అంటారు. అలాగే అమ్మ విజయమ్మ, చెల్లి షర్మిలమ్మని కూడా జగన్ కొట్టారనేది బహిరంగ రహస్యం. ఇలాంటి ‘టెంపరి’తనాన్ని వదిలించుకోవడానికి మానసిక చికిత్స, కౌన్సిలింగ్ అవసరం. అందుకే జగన్ లండన్ వెళ్ళారని అంటున్నారు.

జగన్ చూసి కూడా తప్పులు చదవడం, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడానికి జంకడం, మీడియా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు తడబడుతూ వుండటం, వెర్రి నవ్వులు నవ్వడం, చెప్పాల్సిందేదో చెప్పకుండా దిక్కులు చూడటం… ఇలాంటి లక్షణాలన్నిటినీ బాగు చేసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. 

ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద వున్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది. అయిదేళ్ళపాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి… అవమానాలను ఎలా భరించాలి.. ఇలాంటి మానసిక వేదనతో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. ఇలాంటి మానసిక సమస్యలన్నిటికి నిపుణుల చేత గంపగుత్తగా చికిత్స చేయించుకోవడానికే జగన్ వెళ్ళినట్టయితే, ఆయన ఆ చికిత్సలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని కోరుకోవడం సాటి మనుషులుగా అందరి బాధ్యత. అలాగే, ముఖ్యమంత్రిగా తనకు లభించిన అవకాశాన్ని ఆయన ఎలాగూ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రెండోసారి అవకాశం దక్కబోతోంది. మారిన మనిషిగా ఆయన ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం.

Exit mobile version