Home క్రికెట్ SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

0

అదరగొట్టిన క్లాసెన్, నితీశ్

అభిషేక్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. అయితే, 11వ ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి రెచ్చిపోయారు. క్లాసెన్ 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. నితీశ్ 25 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి మెప్పించాడు. వీరిద్దరూ దూకుడుతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. అయితే.. గెలుపుకు సమీపమైన తరుణంలో నితీశ్, క్లాసెన్ ఔటయ్యారు. చివర్లో అబ్దుల్ సమాద్ (11 నాటౌట్) నిలిచాడు. మొత్తంగా సన్‍రైజర్స్ హైదరాబాద్ అలవోకగా విజయం సాధించేసింది.

Exit mobile version