Home బిజినెస్ Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

0

Mahindra XUV 3XO price : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న మహీంద్రా అండ్​ మహీంద్రా.. మరో హిట్​ కొట్టింది! మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా లాంచ్​ చేసిన మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓను కస్టమర్ల ఎగబడి కొంటున్నారు. బుకింగ్స్​ మొదలైన గంటకే.. 5ంవేలకుపైగా మంది కస్టమర్లు.. ఈ కొత్త ఎస్​యూవీని బుక్​ చేసుకోవడం విశేషం! అంటే ప్రతి సెకనుకు 833 యూనిట్లు బుక్ అయినట్టు అర్థం! ఇక మే 26 నుంచి ఈ ఎస్​యూవీ డెలివరీలు ప్రారంభంకానున్నాయి. మహీంద్రా ఇప్పటికే.. 10వేల ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ యూనిట్లను ఉత్పత్తి చేసిందని, సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ కోసం నెలకు 9,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉందని సమాచారం. వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్​సైట్​ లేదా సంబంధిత డీలర్​షిప్​ ,షోరూమ్​కు వెళ్లి రూ .21,000 టోకెన్​ అమౌంట్​ని చెల్లించడం ద్వారా ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓను బుక్ చేసుకోవచ్చు.

Exit mobile version