Home అంతర్జాతీయం Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్...

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

0

ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

ఆకాశంలో ఉండగా ఎయిర్ ఇండియా విమానంలోని ఏసీ యూనిట్ లో మంటలు వచ్చాయని, ఆ విమానాన్ని తిరిగి ఢిల్లీ ఏర్ పోర్ట్ కు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఢిల్లీ విమానాశ్రయంలో పూర్తి స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. మూడు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో ల్యాండింగ్ లేదా టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న ఇతర విమానాలను ప్రత్యామ్నాయ సూచనలు చేశారు. ‘‘అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 6.15 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. మూడు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించాం’ అని డీఎఫ్ఎస్ అధికారి తెలిపారు.

Exit mobile version