Home తెలంగాణ పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….

పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….

0
  • పదవ తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించిన సాయి రామా హై స్కూల్ విద్యార్థులు….
  • 100% ఉతిన్నత సాధించిన విద్యార్థులు
  • ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సాయిరామ పాఠశాల మేనేజ్మెంట్

జనవాహిని రంగారెడ్డి హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఆఫీస్ పెట్ ప్రేమ్ నగర్ కి చెందిన సాయిరామ హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు 100% ఉత్తీర్ణతతో ఆఫీస్ పెట్ డివిజన్లో రికార్డు సృష్టించారు. సానియా 9.7, రాగిణి 9.5, శిఖ 9.5 ,రాజేష్ 9.5, మాలన్ 9.3, ప్రతిభ 9.3, మౌనిక 9.2, హబీబా 9.0, నస్ర 8.8 ,ముస్కాన్ 8.7.ఈ సందర్భంగా అత్యధిక జిపిఎ సాధించిన విద్యార్థులను పాఠశాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల మేనేజ్మెంట్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పదో తరగతి పరీక్ష ఫలితాలు మాదిరిగానే రాబోవు రోజుల్లో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరును తేవాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు జహంగీర్, రహీం, శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణతో పాఠశాలలో నేర్చుకున్న విద్యా ,బుద్ధులతో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు కోరారు.

Exit mobile version