Telangana water crisis : బెంగళూరు నీటి సంక్షోభం గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక్క బెంగళూరుకే పరిమితం అవ్వలేదని.. తాజా రిపోర్టు చూస్తే స్పష్టమవుతోంది. యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత సమస్య ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో.. నీటి నిల్వలు ఆందోళనకర రీతిలో పడిపోయాయని.. సెంట్రల్ వాటర్ కమిషన్ సీడబ్ల్యూసీ చెప్పింది. ప్రస్తుతం రిజర్వాయర్ల కెపాసిటీలో సగటున 17శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది.