Home అంతర్జాతీయం UPSC CAPF 2024: సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్స్ భర్తీకి నోటిఫికేషన్ జారీ; ఇలా...

UPSC CAPF 2024: సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్స్ భర్తీకి నోటిఫికేషన్ జారీ; ఇలా అప్లై చేసుకోండి..!

0

UPSC CAPF 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in. లేదా upsc.gov.in లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు.

లాస్ట్ డేట్ మే 14; వేకెన్సీల వివరాలు

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (CAPF) అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ మే 14. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ కింది కేంద్ర సాయుధ పోలీసు విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 186 ఖాళీలు
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF): 120 ఖాళీలు
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 100 ఖాళీలు
  • ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 58 ఖాళీలు
  • సశస్త్ర సీమా బల్ (SSB): 42 ఖాళీలు

UPSC CAPF 2024: ఓటీఆర్ తప్పని సరి

మొదటి సారి యూపీఎస్సీ (UPSC) ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) కోసం యూపీఎస్సీ వెబ్ సైట్ upsconline.nic.in లోనే లింక్ ఉంటుంది. ఓటీఆర్ పూర్తయిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలు అవుతుంది. ఇప్పటికే ఓటీఆర్ పూర్తి చేసిన వారు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలాంటి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను అందించడం ద్వారా దరఖాస్తు ఫారాన్ని నింపవచ్చు.

UPSC CAPF 2024: అర్హత ప్రమాణాలు

యూపీఎస్సీ నిర్వహించే ఈ UPSC CAPF 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింది అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. అవి

  • అభ్యర్థులు భారతీయ పౌరులు అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపిన తర్వాతే నాన్ సిటిజన్లను నియమించడం జరుగుతుంది.
  • వయోపరిమితి: ఆగస్టు 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. 25 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు అనర్హులు. అంటే, వారు ఆగస్టు 2, 1999 కంటే ముందు, ఆగస్టు 1, 2004 తర్వాత జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు: యూపీఎస్సీ సీఏపీఎఫ్ 2024 దరఖాస్తు ఫీజు రూ.200. మహిళా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
  • మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ఇక్కడ చూడండి.

Exit mobile version