Home అంతర్జాతీయం Lok sabha elections 2024 : ఆసుపత్రి నుంచి వచ్చి ఓటు వేసిన ఇన్ఫోసిస్​ నారాయణ...

Lok sabha elections 2024 : ఆసుపత్రి నుంచి వచ్చి ఓటు వేసిన ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి!

0

2024 Lok Sabha Elections Phase 2 live updates : 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ జోరుగా సాగుతోంది. మొత్తం 88 సీట్లకు ఓటింగ్​ ప్రక్రియ జరుగుతోంది. బెంగళూరులో చాలా మంది ప్రముఖులు.. ఉదయాన్నే వచ్చి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇన్ఫోసిస్ సహ​ వ్యవస్థపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి కూడా ఓటు వేశారు. అయితే.. నారాయణ మూర్తి,ఆసుపత్రి నుంచి వచ్చి మరీ ఓటు వేశారని.. సుధా మూర్తి చెప్పారు.

బెంగళూరు సౌత్​లోని జయానగర్​కు వెళ్లి.. ఉదయాన్నే ఓటు వేశారు నారాయణ మూర్తి, సుధా మూర్తి.

“నారాయణ మూర్తికి ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన్ని డిశ్చార్జ్​ చేసి, ఓటింగ్​ కోసం తీసుకొచ్చాము. ఇప్పుడు ఇంటికి వెళుతున్నాము,” అని.. ఓటు వేసిన అనంతరం మీడియాతో చెప్పారు సుధా మూర్తి.

Narayana Murthi 2024 Lok Sabha Elections : తనకి కూడా ట్రావెలింగ్​ ప్లాన్స్​ ఉన్నాయని, కానీ ముందు ఓటు వేయడానికి వచ్చినట్టు సుధా మూర్తి తెలిపారు.

ఆసుపత్రి నుంచి వచ్చి మరీ ఓటు వేసిన 77ఏళ్ల నారాయణ మూర్తిపై ప్రశంసల వర్షం కురిపించారు కర్ణాటక చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​.

“77ఏళ్ల ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అందరికి స్ఫూర్తిదాయకం. ఆసుపత్రి అధికారుల నుంచి అనుమతులు తీసుకుని మరీ వచ్చి.. ఓటు వేశారు. భారత్​ కోసం, ప్రజల కోసం ఆయన అంకిత భావానికి ఇది నిదర్శనం,” అని ట్వీట్​ చేశారు కర్ణాటక సీఈఓ.

తాను ఓటు వేయడమే కాదు.. ప్రజలందరు వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు నారాయణ మూర్తి.

Narayana Murthy Sudha Murthy voting : “రాజ్యంగం ఇచ్చిన హక్కును వినియోగించుకునేందుకు 5ఏళ్లకొసారి అవకాశం వస్తుంది. అందుకే.. ఈ రోజు ఎంతో సంతోషకరమైన రోజు. మనమందరం ఎంతో ఉత్సాహంతో ఓటు వేయాల్సిన రోజు ఇది,” అని చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి.

కర్ణాటక సౌత్​లో తేజస్వీ సూర్య బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక కర్ణాటక మొత్తం మీద 14 లోక్​సభ సీట్లకు నేడు పోలింగ్​ జరుగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 9.2శాతం పోలింగ్​ నమోదైంది.

నారాయణ మూర్తి- సుధా మూర్తి సహా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​, క్రికెట్​ లెజెండ్​- టీమిండియా కోచ్​ రాహుల్​ ద్రవిడ్​, నటులు ప్రకాశ్​ రాజ్​ వంటి ప్రముఖులు.. 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తం 88 సీట్లకు పోలింగ్​..

2024 Lok Sabha elections : వాస్తవానికి ఈ దఫా పోలింగ్​లో 89 సీట్లకు పోలింగ్​ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్​ బేటుల్​ నియోజకవర్గం పోలింగ్​ని మే 7కు వాయిదా వేశారు. బీఎస్​పీ అభ్యర్థి మరణం ఇందుకు కారణం.

కాగా.. మొత్తం 20 రాష్ట్రాల్లో శుక్రవారం ఎన్నికలు జరగుతున్నాయి. వీటిల్లో 14 సీట్లు కర్ణాటకలో, 13 సీట్లు రాజస్థాన్​లో, 8 సీట్లు ఉత్తర్​ ప్రదేశ్​లో, 8 సీట్లు మహారాష్ట్రలో, 7 సీట్లు మధ్యప్రదేశ్​లో ఉన్నాయి.

ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్​ వివరాలు..

అసోం 27.43%

బిహార్​ 21.68%

ఛత్తీస్​గఢ్​ 35.47%

జమ్ముకశ్మీర్​ 26.61%

కర్ణాటక 22.34%

కేరళ 25.61%

మధ్యప్రదేశ్​ 28.15%

మహారాష్ట్ర 18.83%

మణిపూర్​ 33.22%

రాజస్థాన్​ 26.84%

త్రిపుర 36.42%

పశ్చిమ్​ బెంగాల్​ 31.25%

Exit mobile version