Home రాశి ఫలాలు Kubera yogam: దేవ గురువు ఆశీస్సులతో కుబేర యోగం.. వీరికి సంపద, ఐశ్వర్యం, ఆనందం

Kubera yogam: దేవ గురువు ఆశీస్సులతో కుబేర యోగం.. వీరికి సంపద, ఐశ్వర్యం, ఆనందం

0

Kubera yogam: నవగ్రహాలలో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవ గురువు బృహస్పతిని భావిస్తారు. పన్నెండు నెలలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. మే నెలలో కీలకమైన బృహస్పతి సంచారం జరగనుంది. 

మే 1న బృహస్పతి మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో గురు సంచారం ప్రారంభం కాగానే అద్భుతమైన కుబేర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావం పన్నెండు రాశుల మీద ఉంటుంది. అయితే కొన్ని రాశుల జాతకులు మాత్రం అద్భుతమైన లాభాలను పొందబోతున్నారు. కుబేర యోగం వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన సంపద లభిస్తుంది. సంపదకు అధి దేవుడిగా భావించే కుబేరుడి ఆశీస్సులు ఏయే రాశుల వారికి ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాయో తెలుసుకుందాం. 

వృషభ రాశి

బృహస్పతి వృషభ రాశిలోనే సంచరించబోతున్నాడు. ఫలితంగా ఈ రాశిలోనే కుబేర యోగం ఏర్పడుతుంది. బృహస్పతి సంచారం ఈ రాశి లగ్న గృహంలో జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారికి భౌతిక ఆనందం పెరుగుతుంది. వృత్తి జీవితంలో గొప్ప విజయాలు నమోదు చేసుకుంటారు. కార్యాలయంలో ఎదుర్కొనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. పదోన్నతి పొందుతారు. శక్తి, పూర్తి ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. బృహస్పతి సంచారం వల్ల ఇప్పటి వరకు ఉన్న శారీరక, మానసిక సమస్యలు తొలగిపోతాయి. సౌభాగ్యం, సంతోషం కలుగుతాయి. పనిలో మంచి మార్పులు వస్తాయి. మీ కోరికలు నెరవేరతాయి. జీవితం విలాసాలతో గడుపుతారు. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బృహస్పతి ఆశీస్సులు పుష్కలంగా లభించునున్నాయి. కుబేర యోగం ఫలితంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సౌభాగ్యం, సంతోషం పెరుగుతుంది. కుబేర యోగం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ జీవితం సుభిక్షంగా ఉంటుంది. కుబేర యోగం కర్కాటక రాశి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ జీవితం రొమాంటిక్ గా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కెరీర్ లో సానుకూల మార్పులు ఉంటాయి. 

కన్యా రాశి

కన్యా రాశి వారికి కుబేర యోగం అనుకూలంగా ఉంటుంది. సంపద, సంతోషం రెండూ లభించడంతో ఆనందంగా ఉంటారు. కుబేరుడి ఆశీస్సులతో అపారమైన సంపదను పొందుతారు. ఊహించని భౌతిక సౌకర్యాలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. పనికి సంబంధించి విదేశాలకు లేదా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.  కష్టపడి పని చేయడంతో ప్రశంసలు దక్కుతాయి. కుటుంబం కోసం సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. విదేశాల్లో ఉపాధి పొందే అవకాశం లభిస్తుంది. మానసిక ఆనందం కలుగుతుంది. కుబేరుడి ఆశీస్సులతో డబ్బుకు సంబంధించిన సమస్యలను సమసిపోతాయి. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. వ్యాపార విస్తరణకు మార్గాలు ఏర్పడతాయి. 

 

Exit mobile version