Home తెలంగాణ జగన్ మీద హైపర్ ఆది వేసిన పంచ్‌ల లిస్టు! | Hyper aadi puches| hyper...

జగన్ మీద హైపర్ ఆది వేసిన పంచ్‌ల లిస్టు! | Hyper aadi puches| hyper aadi

0

posted on Apr 26, 2024 3:55PM

జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా హైపర్ ఆది వేస్తున్న పంచ్‌లు అదరిపోతున్నాయి. ఆది స్పీచ్‌లకు ప్రజల నుంచి విశేష ప్రతిస్పందన లభిస్తోంది. ఇదిగో హైపర్ ఆది జగన్ బ్యాచ్ మీద వేస్తున్న పంచ్‌ల లిస్టు..

1. కూటమిని చూసి వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ, పైకి మాత్రం సింహం సింగిల్‌గా వస్తుంది అంటున్నారు. మరి 2014లో కూడా సింహం సింగిల్‌గా వచ్చింది కదా.. మరి ఎందుకు ఓడిపోయింది? ఈసారి కూడా అదే కూటమి ఏర్పడింది.. ఈసారి కూడా కూటమికి అదే విజయం.. వైసీపీ అదే ఓటమి దక్కుతుంది.

2. షూటింగ్‌లన్నీ ఆపుకుని ప్రచారానికి వచ్చాను.. అక్కడ షూటింగ్‌లు లేకపోయినా.. ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా వుండే వాళ్ళని మాటలతో షూట్ చేయడం కంటిన్యూ అవుతుంది.

3. కమెడియన్ ప్రచారానికి వచ్చాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు.. నేను ప్రొఫెషనల్‌గానే కమెడియన్‌ని.. వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్‌ని కాదు.

4. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ వైసీపీ వాళ్ళు ఊదరగొడుతున్నారు. రెండు చోట్ల ఓడిపోయినా ఎంతోమంది కష్టాన్ని తీర్చాడు.. అదే ఆయన గెలిస్తే, ప్రజల కష్టం కాంపౌండ్ దాటకుండా చూసుకుంటాడు.

5. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టుకోవడానికో సినిమాలను ఒప్పుకునే హీరోలను చూసి వుంటాడు.. కానీ, కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్.

6. ఆయన ప్రెజెంట్ ఆస్తి ఎంత వుంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజీ మీద వున్న నాయకుల ఆస్తికంటే తక్కువే వుంటుంది. ఎందుకంటే, వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే తప్ప, డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకి లేదు.

7. వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి రెడీగా వుంటారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది.

8. వారాహి బండి యాత్ర ఆపేస్తారా? ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు.. అప్పుడు మీ పని కాశీ యాత్రే.

9. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన వున్నాడు కాబట్టే జనసేనానిగా వున్నాడు. మీరు ఇలాగే విసిగిస్తే ‘వీరమల్లు’ బయటకి వస్తాడు.. జాగ్రత్త.

10. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదురా.. ప్రేమకు లొంగే స్టార్..

11. దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అన్న నోళ్ళతోనే అంజనీ పుత్రుడు అనిపించుకునే రోజు వస్తుంది.

12. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకి మీ అబ్బ గుర్తొస్తాడు.

13. 151 మంది ఒక్కడికి భయపడిపోతున్నారు.

14. పవన్ కళ్యాణ్‌ది నిలకడలేని రాజకీయం కాదు.. నిఖార్సైన రాజకీయం.

Exit mobile version