Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 560 పాయింట్లు పెరిగి 73,649 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 189 పాయింట్లు పెరిగి 22,336 వద్ద ముగిసింది. ఇక 351 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ..351 పాయింట్లు పెరిగి 47,925 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ కీలక సపోర్ట్ దగ్గర నుంచి పైకి పెరిగింది. రానున్న సెషన్స్‌లో కూడా పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2915.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3542.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.67శాతం, నాస్డాక్ 1.11శాతం మేర లాభపడ్డాయి. ఎస్ అండ్ పీ 500 0.87శాతం లాభాల్లో ముగిసింది.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్:- బై రూ. 663.2, స్టాప్ లాస్ రూ. 640, టార్గెట్ రూ. 706
ఎస్బీఐ:- బై రూ. 766, స్టాప్ లాస్ రూ. 735, టార్గెట్ రూ. 825
ఎల్ అండ్ టీ:- బై రూ. 3610, స్టాప్ లాస్ రూ. 3520, టార్గెట్ రూ. 3770
డీకాల్:- బై రూ. 230, స్టాప్ లాస్ రూ. 224, టార్గెట్ రూ. 245
హావెల్స్ ఇండియా:- బై రూ. 1549- రూ. 1551, స్టాప్ లాస్ రూ. 1525, టార్గెట్ రూ. 1597
త్రివేణి ఇంజినీరింగ్:- బై రూ. 358- రూ. 360, స్టాప్ లాస్ రూ. 354.5, టార్గెట్ రూ. 372