Home ఎంటర్టైన్మెంట్ James Cameron: ఓటీటీలోకి వ‌చ్చిన అవ‌తార్ డైరెక్ట‌ర్ కొత్త వెబ్‌సిరీస్‌ – టీవీలోనూ రిలీజ్‌

James Cameron: ఓటీటీలోకి వ‌చ్చిన అవ‌తార్ డైరెక్ట‌ర్ కొత్త వెబ్‌సిరీస్‌ – టీవీలోనూ రిలీజ్‌

0

James Cameron: అవ‌తార్ ఫేమ్ జేమ్స్ కామెరూన్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన డాక్యుమెంట‌రీ సిరీస్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. సీక్రెట్స్ ఆఫ్ ది అక్టోప‌స్‌ పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ను నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ ఛానెల్ కోసం జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించారు. ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌కు డైరెక్ట‌ర్‌గానే కాకుండా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూస‌ర్‌గా జేమ్స్ కామెరూన్ వ్య‌వ‌హ‌రించారు.

ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌లోని కొన్ని ఎపిసోడ్స్ మాత్ర‌మే జేమ్స్ కామెరూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్లు స‌మాచారం. ఎక్కువ భాగం ఆడ‌మ్ గీగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సిరీస్‌కు ద‌ర్శ‌కుడిగా ఆడ‌మ్‌ గీగ‌ర్ పేరు ఉంది. సీక్రెట్స్ ఆఫ్ ది అక్టోప‌స్ సిరీస్‌కు హాలీవుడ్‌ యాక్ట‌ర్ పాల్‌రుడ్ న‌రేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ డాక్యూమెంట‌రీ సిరీస్ మొత్తం పాల్ రుడ్ వాయిస్‌తోనే సాగ‌నుంది.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో…

సీక్రెట్స్ ఆఫ్ ది అక్టోప‌స్‌ సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు భార‌తీయ భాష‌ల్లో ఈ సిరీస్‌ను రిలీజ్ చేశారు. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌తో హులు ఓటీటీలో ఈ డాక్యుమెంట‌రీ సిరీస్ రిలీజైంది.

ఏలియ‌న్ క్రియేచర్‌…

స‌ముద్ర‌జ‌లాల్లో అట్ట‌డుగున నివ‌సించే అక్టోప‌స్ జీవుల‌కు సంబంధించిన ఎన్నో వింత‌లు, విశేషాల్ని ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌లో చూపించారు. ఏలియ‌న్ క్రియేచ‌ర్‌గా పేరొందిన అక్టోప‌స్ వెనుకున్న ప‌లు మిస్ట‌రీల‌ను డీటైలింగ్‌గా ఈ సిరీస్‌లో ఆవిష్క‌రించిన‌ట్లు స‌మాచారం. అక్టోప‌స్‌ల‌పైనే కాకుండా గ‌తంలో సీక్రెట్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్‌, సీక్రెట్స్ ఆఫ్ ది వేల్స్ పేరుతో జేమ్స్ కామెరూన్ డాక్యుమెంట‌రీ సిరీస్‌ల‌ను రూపొందించారు.

అవ‌తార్ మూడు, నాలుగు భాగాల‌తో బిజీ…

అవ‌తార్ మూడో భాగంతో పాటు నాలుగో భాగం షూటింగ్‌తో జేమ్స్ కామెరూన్ బిజీగా ఉన్నాడు. అవ‌తార్ 3 2025 డిసెంబ‌ర్ 19న రిలీజ్ కాబోతోంది. మూడో పార్ట్‌కు సంబంధించి షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుతోన్నారు. గ్రాఫిక్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌మున్న సినిమా కావ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కు రెండేళ్లు స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు అవ‌తార్ 4 షూటింగ్ జ‌రుగుతోంది. 2029లో అవ‌తార్ 4 రిలీజ్ కాబోతోంది.

2022లో అవ‌తార్ 2 రిలీజ్‌…

2022లో రిలీజైన అవ‌తార్ 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప్ర‌భంజ‌నాన్ని సృష్టించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండు బిలియ‌న్ డాల‌ర్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇండియ‌న్ క‌రెన్సీలో ప‌దిహేను వంద‌ల కోట్ల‌కుపైనే ఈ మూవీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప‌దేళ్ల పాటు అవ‌తార్ 2 తెర‌కెక్కించారు జేమ్స్ కామెరూన్‌. అవ‌తార్ వ‌న్‌లో పండోరా గ్ర‌హం కోసం నెట్రి, జాక్ చేసే పోరాటాన్ని చూపించారు ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్‌. అవ‌తార్ 2ను ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు యాక్ష‌న్ అంశాల‌ను మిక్స్ చేస్తూ తెర‌కెక్కించారు.

స్కై పీపుల్ ఎటాక్‌…

ఐదుగురు పిల్ల‌ల‌తో సంతోషంగా పండోరా గ్ర‌హంపై జీవితాన్ని వెల్ల‌దీస్తున్న జాక్‌, నెట్రి ల‌పై మ‌రోసారి గ్ర‌హాంత‌ర వాసులు (స్కై పీపుల్‌) ఎటాక్ చేస్తారు. చ‌నిపోయాడ‌ని అనుకున్న క్వారిచ్ అవ‌తార్ రూపంలో బ‌తికి రావ‌డ‌మే కాకుండా జాక్ ఫ్యామిలీపై తీవ్ర‌మైన ప‌గ‌తో ర‌గిలిపోతుంటాడు.

త‌న ఫ్యామిలీ వ‌ల్ల పండోరా గ్ర‌హానికి ఇబ్బంది రాకూడ‌ద‌ని భావించిన జాక్‌, నెట్రి త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి రీఫ్ ఐలాండ్‌కు వ‌ల‌స వెళ‌తారు. క్వారిచ్‌కు దొర‌క‌కుండా త‌ల‌దాచుకోవాల‌నే వారి ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? వారి ఆచూకీని క్వారిచ్ ఎలా క‌నిపెట్టాడు. ఈ పోరాటంలో త‌న భార్య‌ పిల్ల‌ల‌ను జాక్ కాపాడుకున్నాడా? లేదా అనే అంశాల‌ను అవ‌తార్ 2ను ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించాడు.

Exit mobile version