Home తెలంగాణ Temple Tour Package : వీకెండ్ లో వన్ డే టూర్ ప్యాకేజీ

Temple Tour Package : వీకెండ్ లో వన్ డే టూర్ ప్యాకేజీ

0

Sathavahana Region Temple Tour Package : ఈ సమ్మర్ లో అధ్యాత్మిక లేదా పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఆలోచన ఉందా..? అయితే చాలా తక్కువ ధరతోనే టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). కేవలం 2వేల ధరతోనే ఉత్తర తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను చూపించనుంది. బస్సు జర్నీ ద్వారా హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 

టెంపుల్ టూర్ ప్యాకేజీ షెడ్యూల్ వివరాలివే:

  • ఉత్తర తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను చూసేందుకు  Temple Tour (Sathavahana Region) ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.
  • ప్రతి శని, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • హైదరాబాద్ నగరం నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
  • టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 1999, పిల్లలకు రూ 1,599గా ఉంది.
  • నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది.
  • డే 1 – ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
  • 07.15 AM – Departure from IRO Yatrinivas (Phone: 9848126947) 
  • 08.30 AM to 09.00 AM – మధ్య హారిత హోటల్ లో టీ, టిఫిన్ ఉంటుంది.
  • 09.00 AM – ప్రజ్ఞాపూర్ నుంచి వేములవాడకు స్టార్ట్ అవుతారు.
  • 10.30 AM to 11.30 AM –  వేములవాడ రాజన్న(Vemulawada) టెంపుల్ ను దర్శించుకుంటారు.
  • 12.15 PM – కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు.
  • 12.15 PM to 02.30 PM – కొండగట్టు అంజన్న దర్శనం(Sri Anjaneya Swamy Temple, Kondagattu) ఉంటుంది. హారిత హోటల్ లో లంచ్ ఉంటుంది.
  • 02.30 PM – ధర్మపురికి స్టార్ట్ అవుతారు.
  • 04.00 PM to 06.00 PM – ధర్మపురి ఆలయ(Dharmapuri temple) దర్శనం పూర్తి అవుతుంది. టీ బ్రేక్ ఉంటుంది.
  • 06.00 PM – హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు.
  • 10.00 PM – హైదరాబాద్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 నెంబర్ ను సంప్రందించవచ్చు. 
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను తెలుసుకోవటంతో పాటు మిగతా ప్యాకేజీలను కూడా చెక్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ నుంచి పంచారామాల’ ట్రిప్…

మరోవైపు తక్కువ ధరలోనే Pancharamam Temples Tour ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. ఇందులో భాగంగా… ఏపీలోని ప్రముఖ ఐదు పంచారామ క్షేత్రాలను చూపించనుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

  • పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలను చూసేందుకు పంచారామాల టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.
  • హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • నాన్ ఏసీ హైటెక్ కోచ్ బస్సులో జర్నీ చేస్తారు.
  • పెద్దలకు రూ.4999, పిల్లలకు రూ. 3999గా టికెట్ ధరలు ఉన్నాయి.
  • ఇందులో భాగంగా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షరామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శిస్తారు
  • DAY-1 రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతారు.
  • DAY-2 – ఉదయం 5 గంటలకు అమరావతికి చేరుకుంటారు. ఇక్కడ్నుంచి Palakollu, Bhimavaram, Draksharamam, Samarlakotaకు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • DAY-3 – ఉదయం 07.00 AMకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

Exit mobile version