Home తెలంగాణ Crop Damage in Telangana : అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్

Crop Damage in Telangana : అకాల వర్షాలు, పంట నష్టంపై సర్కార్ ఫోకస్

0

కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల అవస్థలు

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు (Rains in Telangana) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. కాగా ఇప్పటికే శనివారం ఉదయం ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఇదిలాఉంటే రాష్ట్రంలో వరి కోతల సీజన్ నడుస్తుండగా.. ఇప్పటికే చాలామంది కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొని వస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు మిల్లుల అలాట్ మెంట్ పూర్తి కాకపోవడం, మరికొన్ని చోట్లా తేమ, తాలు పేరున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సాకులు చెబుతుండటంతో కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫలితంగా చాలాచోట్లా రైతుల ధాన్యమంతా కల్లాల్లోనే ఉండిపోయింది. అంతేగాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా బార్దాన్ కూడా టైంకు ఇవ్వకపోవడం, లారీలు రాకపోవడం వల్ల కాంటాలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే అకాల వర్షాలు అందుకోవడంతో శనివారం ఉదయం, ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు చాలాచోట్లా కోతకు వచ్చిన వరి నేలవాలగా,, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. నిజామాబాద్, కామారెడ్డి, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ తదితర జిల్లాల్లో వర్ష తీవ్రత కనిపించగా.. ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Exit mobile version