Home తెలంగాణ జగన్మోసం.. షర్మిలకు ఆస్తిలో వాటా కాదు.. అప్పు ఇచ్చారు! | jagan deceive sharmila| denied|...

జగన్మోసం.. షర్మిలకు ఆస్తిలో వాటా కాదు.. అప్పు ఇచ్చారు! | jagan deceive sharmila| denied| share| assets| gave| loan

0

posted on Apr 22, 2024 9:27AM

మోసం చేయడంలోనూ, బెదరించి పబ్బం గడుపుకోవడంలోనూ వైసీపీ అధినేత జగన్ ను మించిన వారు లేరని స్వయంగా ఆయన సోదరి షర్మిల ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఎవరికైనా ఇట్టే అవగతమౌతుంది. 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ( ఏప్రిల్ 20) కడప లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి   షర్మిల వెంట ఉన్నారు.  షర్మిల తన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ. 182.82 కోట్లుగా పేర్కొన్నారు.  అలాగే చరాస్తులు తన పేరు మీద మీద 26 కోట్లు, రూ.   భర్త అనిల్ పేరు మీద 45.19 కోట్లు ఉన్నట్లు తెలిపారు.

షర్మిల తమ తండ్రి ఆస్తుల్లో తనకు సరైన వాటా నిరాకరించడంతో సోదరుడిపై తిరుగుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అఫిడవిట్ చూస్తే జగన్ ఆమెకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడమే కాదు ఆమెకు అప్పులు మాత్రమే ఇచ్చారని అర్ధమౌతోంది. ఎందుకంటే ఆమె షర్మిలకు జగన్ దగ్గర అప్పులు ఉన్నాయి.  ఆమె అఫిడవిట్ ప్రకారం  సోదరుడు జగన్ రెడ్డి దగ్గర రూ. 82 కోట్లకుపైగా అప్పు తీసుకున్నట్లుగా చూపించారు. దీనిలో ఏదో మతలబు ఉందని అందరూ భావించారు. అయితే ఆ మతలబు ఏమిటో  షర్మిల ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించేశారు.  ఆస్తిలో తనకు రావాల్సిన వాటాలో  ఒకింత ఇచ్చి.. దానినే అప్పుగా జనగ్ మార్చేశారని షర్మిల చెప్పారు. కర్నూలులో ఎన్నికల ప్రచారంలో   విషయాలను జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల ఈ విష యాలను తన నోటి వెంటే వెల్లడించారు.   కుటుంబ ఆస్తిలో వాటా ఆడబిడ్డ హక్కు అయితే జగన్ తన హక్కును కాలరాశారని షర్మిల విమర్శించారు. చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన అస్థి వాటాను తమ వాటాగా భావిస్తారని జగన్ గురంచి వ్యాఖ్యానించారు. తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారని.. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారని విమర్శించారు. జగన్ తనకు రావాల్సిన ఆస్తిలో అతి తక్కువ వచ్చి దానిని సైతం అప్పుగా చూపించారనీ, ఈ వాస్తవం మా కుటుంబం మొత్తానికి తెలుసునని షర్మిల అన్నారు.  

అయితే ఇప్పుడు తాను చేస్తున్న పోరాటం తన ఆస్తుల కోసం కాదనీ.. న్యాయం కోసమనీ షర్మిల స్పష్టం చేశారు.  వివేకా ను గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఆమెపైనే నిందలు వేస్తున్నారని విమర్శించారు. రేపు తనకు, సునీతకూ ఏమైనా అవుతుందేమో మాకు తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే అయ్యిందని ప్రాణాలకు తెగించి న్యాయం కోసం చేస్తున్న పోరాటం తనదని షర్మిల చెప్పారు.   జగన్మోసానికి తాను మాత్రమే కాదనీ, యావత్ ఆంధ్రప్రదేశ్ గురైందనీ షర్మిల ధ్వజమెత్తారు.  షర్మిల మాటలను బట్టి అధికారం కోసం జగన్ స్వపర బేధాలను లెక్క చేయరనీ, సొంత చెల్లైనా, జనమైనా ఆయనకు ఒకటేనని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. 

Exit mobile version