posted on Apr 18, 2024 2:51PM
ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో నేటి నుంచి అన్ని రకాల ప్రీపోల్, పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్, ఒపినియన్ పోల్ లకు, సర్వేలకు ఈ రోజుతో చుక్క పడింది. అంటే ఫుల్ స్టాప్ పడింది. నే అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించ కూడదు. ప్రీ-పోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. అంటే ఇప్పటి వరకూ వెలువడిన పది పదకొండు సర్వేలు మినహాయిస్తే ఇక నుంచి మళ్లీ జూన్ 1వ తేదీ అంటే సార్వత్రిక ఎన్నికల తుది దశ ముగిసే వరకూ ఎటువంటి సర్వేలూ వెలువడే అవకాశం లేదు.
ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ ఏపీలో ఎలక్షన్ వార్ వన్ సైడేనని తేల్చేయడం, తెలుగుదేశం కూటమి ఘన విజయం తథ్యమని పేర్కొన్న నేపథ్యంలో కూటమి ప్రచారంలో దూకుడు పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరో వైపు వైసీపీ కూటమిలో గుబులు కనిపిస్తున్నది. జగన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి బస్సు యాత్రకు జన స్పందన కరువు అవ్వడం, జగన్ వినా ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయగలిగే ప్రభావమంతమైన క్యాంపెయినర్లు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. బొత్స, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి వంటి కీలక నేతలు సైతం తమ నియోజకవర్గంలో విజయం కోసమే చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉండటంతో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా శిరోముండనం కేసులో ఆ పార్టీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.
అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై తీర్పు ఈ నెల 23న వెలువడ నుంది. ఒక వేళ అవినాష్ బెయిలు రద్దైతే వైసీపీకి కడపలో కూడా ఇబ్బందులు తప్పవు. అదే విధంగా జగన్ పై గులకరాయి దాడి సెంటిమెంట్ ను రగల్చడం సంగతి అటుంచి మొత్తంగా పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా నవ్వుల పాలు చేసింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమికి దీటుగా వైసీపీ ప్రచారం జోరు పెంచే అవకాశాలు కనిపనించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.