posted on Apr 14, 2024 10:58AM
మైసూర్ పాక్ ప్యాక్ చేసేలోపు రాహుల్ గాంధీ షాపులోని స్వీట్స్.ని రుచి చూశారు. ఆ తర్వాత మైసూర్ పాక్ ప్యాక్ తీసుకుని, స్టాలిన్ ఇంటికి వెళ్ళి అందించారు. స్వీట్ అందుకున్న అనంతరం సీఎం స్టాలిన్ సంతోషంగా స్పందించారు. ‘నా సోదరుడు రాహుల్ గాంధీ ఇచ్చిన తియ్యటి కానుకతో నా హృదయం నిండిపోయింది.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున కూడా ఇండియా కూటమి తప్పకుండా ఇలాంటి తియ్యని విజయాన్నే అందుకుంటుంది’ అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రేమగా తీసుకెళ్ళిన స్వీట్‌ని స్టాలిన్ తినే అవకాశం లేదు. ఎందుకంటే, ఆ స్వీట్ పేరులో కర్నాటకకి సంబంధించిన ‘మైసూర్’ ఉందని కాదు… ఆల్రెడీ స్టాలిన్ బాడీలో కూడా సుగర్ ఫ్యాక్టరీ వుంది కాబట్టి.