హిందూ క్యాలెండర్ ప్రకారం దేవగురువుగా పరిగణించే బృహస్పతి మే 1న వృషభరాశిలోకి ప్రవేశించగా జూన్ 12న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 9న తిరోగమన దశలో సంచరిస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 4, 2025న ప్రత్యక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. చివరిగా మే 14న వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మళ్ళీ బృహస్పతి వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో కదలికలు మార్చుకుంటూ సంచరిస్తాడు. బృహస్పతి సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వాళ్లు లాభాలు పొందబోతున్నారు.