Home తెలంగాణ తెలంగాణ మంత్రి పొంగులేటి వాహనం తనిఖీ  

తెలంగాణ మంత్రి పొంగులేటి వాహనం తనిఖీ  

0

posted on Apr 13, 2024 2:49PM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు ఎన్నికల కమిషన్ ఆధీనంలో పని చేయాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నేత గత అసెంబ్లీ ఎన్నికలముందు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరి ఆ పార్టీని విజయతీరాలకు చేర్చిన ముఖ్యుల్లో ఒకరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మొదటి కేబినెట్ లో పొంగులేటికి మంత్రి పదవి లభించింది. లోకసభ ఎన్నికలు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఎన్నికల కమిషన్ తెలంగాణ మంత్రుల మీద దృష్టి కేంద్రీకరించింది. 

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సరిహద్దుల్లో ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. శనివారం ఆయన తిరుమలాయంపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి వెళుతున్న సమయంలో మాదిరిపురం వద్ద మంత్రి వాహనాన్ని పోలీసులు చెక్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనాలను చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పొంగులేటి వాహనాన్ని చెక్ చేశారు. ఆయన తనిఖీలకు పూర్తిగా సహకరించారు.

Exit mobile version