Home క్రికెట్ RR vs RCB Highlights: బట్లర్ శతక మెరుపులు.. కోహ్లీ సెంచరీ వృథా.. ఆర్సీబీకి హ్యాట్రిక్...

RR vs RCB Highlights: బట్లర్ శతక మెరుపులు.. కోహ్లీ సెంచరీ వృథా.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి.. అజేయంగా రాజస్థాన్

0

జాస్ బట్లర్ చివరి వరకు నిలిచి 58 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసి శతకం పూర్తిచేశాడు. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో దుమ్మురేపాడు. చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో సిక్స్‌తో శకతం పూర్తి చేసుకున్నాడు. శాంసన్ 42 బంతుల్లోనే 69 పరుగులు (8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టాడు. శాంసన్ ఔటైనా బట్లర్ ఆఖరి వరకు నిలిచాడు. 19.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 189 పరుగులు చేసి రాజస్థాన్ గెలిచింది. బెంగళూరు బౌలర్లలో రీస్ టాప్లీ రెండు, యశ్ దయాల్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.

Exit mobile version