Home తెలంగాణ Karimnagar District : హుజురాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Karimnagar District : హుజురాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

0

Huzurabad Road Accident : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి మూల మలుపు వద్ద బైక్ పై టిప్పర్ బోల్తాపడింది. బైక్ పై ఉన్న బోర్నపల్లికి చెందిన గంట వర్ష(15), గంట విజయ్(17), గంట సింధూజ (18) టిప్పర్ మట్టిలో కూరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బోర్నపల్లి లో విషాదం అలుముకుంది. టిప్పర్ వస్తున్న విషయాన్ని గమనించి పక్కనే అపిన బైక్ పై టిప్పర్ బోల్తా పడింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురి లో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరిని ఆసుపత్రి కి తరలించేటప్పుడు మృతి చెందారు. విషయం తెలిసిన స్థానికులు జేసిబి సహాయం తో మృత దేహాలను వెలికి తీశారు. మృతుల్లో విజయ్, వర్ష ఇద్దరు సొంత అన్నా చెల్లెలు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలిపించారు.

Exit mobile version