posted on Apr 6, 2024 2:58PM
నారాయణ్ శ్రీగణేష్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నారాయణ్ శ్రీగణేష్ ను కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిఫారసు చేసింది. ఆ సిఫారసును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంతో మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో శ్రీగణేష్ 41,888 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల 20,825 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.