ఐపీఎల్ మ్యాచ్ టికెట్లలో బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందని దానం(MLA Danam Nagender) ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో పాటు క్రీడాశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. టికెట్లు దొరకకపోవడానికి హెద్రబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులే అని విమర్శించారు. సన్ రైజర్స్ టీమ్ లో హైదరాబాద్ ప్లేయర్లను తీసుకోవటం లేదని… కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడాకారులు లేకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో సదరు టీమ్ పై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక గతంలో కూడా దానం నాగేందర్…. ఇదే తరహా కామెంట్స్ చేశారు. సన్ రైజర్స్ టీమ్ లో లోకల్ ప్లేయర్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా మరోసారి వార్నింగ్ ఇవ్వటంతో…. ఈ వ్యవహారం ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాలి…!