Home తెలంగాణ మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపిస్తాం – రామ-లక్ష్మణులుగా...

మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపిస్తాం – రామ-లక్ష్మణులుగా ఉంటాం డబల్ షూటర్ గా పని చేస్తాం కాటా నీలం ఏకమైన వేళ

0

పటాన్చెరు జనవాహిని న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ :- అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి జన జాతర సభా సన్నాహక సమావేశం ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రామచంద్రపురం శ్రీ కన్వెన్షన్లో నిర్వహించారు.ఈ సందర్భంగా హాజరైన ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ..గతంలో చోటు చేసుకున్న ఘటనలను మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్.ఎం.ఆర్ కార్యకర్తలు కలిసి సహకరించాలని కోరారు. నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తన అన్న లాంటివాడని ఇకపై తాము రామ,లక్ష్మణుల వలె కలిసివుండి, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇకపై పార్టీలో డబుల్ షూటర్లుగా పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ఎదుటి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ముఖ్య నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన జాతర సభకు మెదక్ పార్లమెంటు పరిధి నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

లక్షన్నర మెజారిటీ తీసుకొస్తాం.

పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇక ఇద్దరం కలిసాం…మెదక్ ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్షన్నర ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కృషి చేస్తానని ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి నీలం మధు గెలుపు కోసమే పాటుపడాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో జరిగిన ఘటనలను తాము ఎప్పుడో మరిచిపోయామని, కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. తమ ఇద్దరి మధ్య గొడవలు పెట్టిన వ్యక్తి ఇటీవలే జైలు నుండి విడుదల అయ్యాన్నారు. మళ్లీ ఏదో రకంగా నష్టం కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిన నీలం మధును గెలిపించుకోని, మిగతా పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ అభ్యర్థికి కచ్చితంగా లక్షన్నర మెజార్టీ వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పటాన్చెరు పార్లమెంట్ ఇంచార్జ్ శ్యామ్ గౌడ్, నియోజకవర్గస్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, మున్సిపాలిటీ ప్రెసిడెంట్లు, పట్టణ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version