సాధారణ పూరీలతో పోలిస్తే పెసరపప్పు పూరీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పెసరపప్పులో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటుంది. పెసరపప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి పెసరపప్పును వారంలో కనీసం నాలుగైదు సార్లు తినడం చాలా మంచిది.