Home క్రికెట్ Mayank Yadav: టీ20 ప్రపంచకప్‍లో మయాంక్ యాదవ్‍కు చోటు దక్కుతుందా?

Mayank Yadav: టీ20 ప్రపంచకప్‍లో మయాంక్ యాదవ్‍కు చోటు దక్కుతుందా?

0

Mayank Yadav: ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న పేసర్ మయాంక్ యాదవ్ ప్రపంచ క్రికెట్‍లో అలజడి సృష్టించాడు. ప్రస్తుతం అందరి దృష్టి అతడివైపే ఉంది. ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ఆడింది రెండు మ్యాచ్‍లే అయిన ఈ 21 ఏళ్ల యువ పేసర్ చేసిన ఫాస్ట్ బౌలింగ్ అలాంది. గంటకు 150 కిలోమీటర్ల వేగానికి పైగా వేగంగా బంతులను అలవోకగా సంధించాడు మయాంక్ యాదవ్. వేగంతో పాటు లైన్, లెన్త్ కూడా సరిగ్గా మెయింటెన్ చేశాడు. కళ్లు చెదిరే బంతులు వేశాడు. ఐపీఎల్‍లో తాను ఆడిన తొలి రెండు మ్యాచ్‍ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‍గా మారాడు.

Exit mobile version